
హైదరాబాద్, వెలుగు: తొమ్మిదన్నరేండ్ల బీఆర్ఎస్ దరిద్ర పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కావాలని కాంగ్రెస్ ప్రకటనలపై నిషేధం విధించేలా ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెస్తున్నాయని ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) సర్టిఫికేట్ ఇచ్చిన యాడ్స్‌ను ఆపాలనడం సరి కాదన్నారు. ఓటమి భయంతోనే ప్రశాంత్ కిషోర్‌తో కలిసి బీఆర్ఎస్ ఇలాంటి నాటకాలు ఆడుతున్నదని మండిపడ్డారు.
ALSO READ : హామీలను మరిచిన నాయకులను నిలదీయండి : దినేశ్ కులాచారి
మెట్రో యాడ్స్ రాకుండా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రకటనలు ఆపినంత మాత్రాన ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి పోదని చెప్పారు. ఈసీతో న్యాయం జరగకపోతే కోర్టుకు పోతామని స్పష్టం చేశారు.