ఒకే కుటుంబం.. అప్పటివరకు అంతా సంతోషంగా నవ్వుతూ ప్రయాణం చేస్తున్నారువారంతా.. బిడ్డ పుట్టి ఏడాది అయింది.. దైవం సన్నిధిలోని పుట్టు వెంట్రెకలు తీయాలి అని బంధువులను పిలిపించుకొని ఓ పండగలా చేసుకునేందుకు వెళ్తున్న ఆ కుటుంబాన్ని ఊహించని ఘటన వారి జీవితాల్ని అఘాతంలోకి నెట్టేసింది. రోడ్డ ప్రమాదం రూపంలో వారిని విడదీసింది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబాలో జరిగి ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడటం స్థానికంగా విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే..
హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో మహాల్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం.. ముండన్ వేడుక(పుట్టువెంట్రుకల తీయించే కార్యక్రమం) కు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం లోయలోపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు స్పాట్ లోనే చనిపోయారు. ముగ్గురు మృత్యువుతో పోరాడుతున్నారు. బుధవారం ( జూన్ 17) అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
ముండన్ వేడుకల్లో చేసుకొని వస్తుండగా బాధితులు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం లోతైన లోయలో పడింది. దాదాపు 500 మీటర్ల లోతైన లోయలో పడటంలో వాహనం నుజ్జునుజ్జయింది. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కాగా.. వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కావడంతో ఆ గ్రామంలో విషాదం అలముకొంది.
