ఖమ్మం టౌన్, వెలుగు : ఇటీవల ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్ లో ఛాంబర్ అధ్యక్షుడిగా గెలుపొందిన కురువెళ్ల ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సోమ నరసింహారావు(జి.వై.నరేష్) లు శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బత్తిని నరసింహారావు, సహాయ కార్యదర్శి బాదే రమేశ్, కోశాధ్యక్షుడు తల్లాడ రమేశ్, సెంట్రల్ ఈసీ సభ్యులు మాటేటి కిరణ్ కుమార్, రాయపూడి రవికుమార్, వంగవీటి హరీశ్, పోట్ల రామనాథం ఉన్నారు.
