"చమ్కీల అంగీలేసి"..రీల్స్తో రచ్చ రచ్చ

"చమ్కీల అంగీలేసి"..రీల్స్తో  రచ్చ రచ్చ

చమ్కీల అంగీ వేసి... ఈ పాట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు.  నాచురల్ స్టార్ నాని నటించిన "దసరా"  సినిమా నుంచి రిలీజైన ఈ సాంగ్..సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తెలంగాణ యాసలోని ఈ పాట..జనాల మనసు దోచుకుంది. దీనికి కారణం..మ్యూజిక్..లిరిక్స్...పాట పాడిన సింగర్. ప్రాణ పెట్టిన పాడిన ఈ సాంగ్..ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. 

https://youtu.be/8seOfn3BmW4

రీల్స్ తో  రచ్చ...

ఈ మధ్య ఏ ఫోన్ చూసినా...ఏ రీల్ విన్నా...ఎవరిని కదిలించినా...చమ్కీల అంగీ వేసి సాంగ్ గురించే చర్చ. అంతలా జనాన్ని ఆకర్షించింది. అచ్చమైన తెలంగాణ యాసలోని పాట.. ప్రస్తుతం ట్రెండ్ ను క్రియేట్ చేసింది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ పాటకు జనాలు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. లిరికల్ వీడియాలో తమ గొంతుతో హావభావాలు పలికిస్తున్నారు.  కీర్తి సురేష్ డ్యాన్స్ స్టెప్పులతో దుమ్మురేపుతున్నారు. 

https://youtu.be/eOzqAklVKpM

యూట్యూబ్లో ట్రెండింగ్... 

‘చమ్కీల అంగిలేసి’ సాంగ్ అటు యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. విడుదలైన మూడు వారాల్లోనే 30 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. వేల సంఖ్యలో కామెంట్ చేయగా..దాదాపు నాలుగున్నర లక్షల మంది లైక్స్ చేయడంతో..ఈ పాట ఎంతలా ఆకట్టుకుంటోంది అర్థం చేసుకోవచ్చు. 

https://youtu.be/9O-mBYAqM1c

సింగర్ గొంతులో ఏముందో..కానీ...

కొందరు సింగర్స్‌  గొంతులో  ఏదో మ్యాజిక్‌ ఉంటుంది. అందుకే వాళ్లు పడితే మాయలా అనిపిస్తుంది.  పేరు తెలియకపోయినా...వాయిస్‌ తో మనసు దోచేసుకుంటారు. ఇక చమ్కీల అంగీ వేసి సాంగ్ పాడిన సింగర్ కూడా ఒక్క సాంగ్ తో ఫేవరెట్ అయిపోయింది. చమ్కీల అంగీ వేసి సింగర్ పేరు దీక్షిత.  సింపుల్‌గా ఆమెను "ధీ" అని పిలుస్తుంటారు.

ఎవరీ దీక్షిత...

దసరా సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నారాయణన్‌ కూతురే  సింగర్‌ దీక్షిత. పేరు పెద్దగా పరిచయం లేకపోయినా ఆమె పాడిన  పాటలు చాలా ఫేమస్. ఇందులో  కాటుక కనులే, రౌడీ బేబీ, ఓ సక్కనోడా సాంగ్స్‌ పాడింది దీక్షితే. సినిమాలే కాదు చాలా ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ కూడా చేసింది.  తన 14 ఏట నుంచి సాంగ్స్ పాడటం ప్రారంభించింది. మొదటి పాటే ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌తో పాడి అదరిపోయే ఎంట్రీ ఇచ్చింది. దీక్షిత తెలుగులోనే కాదు తమిళ్ లోనూ చాలా పాటలే పాడింది. భాష ఏదైనా..ఆమె సాంగ్ పాడితే సూపర్ హిట్ అవ్వాల్సిందే. గతంలో పాడిన రౌడీ బేబీ సాంగ్‌ యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్‌ సొంతం చేసుకోగా..తాజాగా చమ్కీల అంగీలేసి సాంగ్‌ అంతకంటే ఎక్కువ వ్యూస్ తో  దూసుకుపోతోంది.

మార్చి 30న రిలీజ్..

ద‌స‌రా మూవీ మార్చి 30వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో హీరోగా నాని..హీరోయిన్ గా కీర్తి సురేశ్ న‌టించిన ఈ సినిమాను శ్రీకాంత్‌ ఓదెల డైరెక్ట్ చేశాడు. ఇప్పటికే ఈసినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్‌, ట్రైలర్‌లు, సాంగ్స్  సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.