హైదరాబాద్, వెలుగు: పల్నాడు వాటర్ గ్రిడ్‌కు బీజం పడిందే 2022లో అని, అప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ స్పష్టం చేశారు. 2022లో జారీ అయిన జీవో 56తోనే సాగర్ నీటి మళ్లింపుకు కుట్ర జరిగిందని ఆరోపించిన ఆయన, ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీశ్‌రావుకు సవాల్ విసిరారు.
ఈ మేరకు బుధవారం గాంధీ భవన్లో మీడియాతో చనగాని దయాకర్ మాట్లాడారు. 2022 ఫిబ్రవరి 16న అప్పటి ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం రూ.1,200 కోట్లతో జీవో 56ను విడుదల చేసి తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టిందని ఆయన గుర్తుచేశారు.
