- చిన్న సైకిల్‌పై ఆడుకుంటుండగా వేగంగా వచ్చి ఢీకొట్టిన క్యాబ్ డ్రైవర్
గండిపేట, వెలుగు : మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో బుధవారం సాయంత్రం ఓ మూడేండ్ల చిన్నారి తన చిన్న సైకిల్‌పై ఆడుకుంటుండగా..నిర్లక్ష్యంగా కారు నడిపిన ఓ క్యాబ్డ్రైవర్పిల్లవాడి ప్రాణాలు తీశాడు. మొఘల్స్కాలనీలో బుధవారం సాయంత్రం గులాం ఉబేద్ (22) అనే క్యాబ్డ్రైవర్ఓవర్స్పీడ్తో నిర్లక్ష్యంగా కారు నడుపుతున్నాడు.
అక్కడి చిన్న గల్లీలో అర్బాజ్ అనే చిన్నారి తన ఇంటి ఎదుట మూడు చక్రాల సైకిల్‌పై ఆడుకుంటున్నాడు. సమీపంలోనే అతడి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయితే, అప్పుడే ఓవర్‌స్పీడ్‌తో వచ్చిన ఉబేద్ఆ చిన్నారిని ఢీకొట్టుకుంటూ వెళ్లాడు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అర్భాజ్అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి తమ కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
