వ్యవసాయ పెట్టుబడులకు రాష్ట్రాన్ని డెస్టినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా తీర్చిదిద్దుతాం : మంత్రి తుమ్మల

వ్యవసాయ పెట్టుబడులకు రాష్ట్రాన్ని డెస్టినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా తీర్చిదిద్దుతాం : మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగంలో ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వ్యవసాయం, ఎరువులు, ఫుడ్ ప్రాసెసింగ్, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ రంగాలను అనుసంధానిస్తూ సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. 

డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్–2026 నేపథ్యంలో బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో వ్యవసాయం, ఎరువులు, ఫుడ్ ప్రాసెసింగ్, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీజీ రంగాల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో వివిధ పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులు పాల్గొన్నారు.