చనాకా -కొరాటకు పర్యావరణ అనుమతులు

చనాకా -కొరాటకు పర్యావరణ అనుమతులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: చనకా కొరాట బ్యారేజీ, ఎత్తిపోతలకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్‌‌‌‌ ఇచ్చింది. సీతమ్మ సాగర్‌‌‌‌ మల్టీపర్పస్‌‌‌‌ ప్రాజెక్టు, సీతారామ లిఫ్ట్‌‌‌‌ స్కీంలకు టర్మ్స్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ రిఫరెన్సెస్‌‌‌‌(టీవోఆర్‌‌‌‌) మంజూరు చేసింది. నిబంధనల మేరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తే తుది అనుమతులు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి లైన్‌‌‌‌ క్లియర్‌‌‌‌ అయింది. మే 31న రివర్‌‌‌‌ వ్యాలీ, హైడ్రోఎలక్ట్రిక్‌‌‌‌ ప్రాజెక్ట్స్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ అప్రైజల్‌‌‌‌ కమిటీ(ఈఏసీ) చైర్మన్‌‌‌‌ కె. గోపకుమార్‌‌‌‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోగా  మీటింగ్​మినట్స్​తాజాగా వెలువడ్డాయి. సీతమ్మసాగర్‌‌‌‌, సీతారామ మల్టీపర్పస్‌‌‌‌ ప్రాజెక్టులకు జారీ చేసిన టీవోఆర్‌‌‌‌తో వాటి అనుమతుల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. తెలంగాణ, మహారాష్ట్ర ఉమ్మడి ప్రాజెక్టు చనాకా - కొరాట (రుద్ర) బ్యారేజీ, ఎత్తిపోతలకు ఈఏసీ గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది. ప్రాజెక్టుతో కాల్వలు, ఇతర పనులకు తుది అనుమతులు మంజూరు చేసింది.