
దేశంలోని ఇన్సూరెన్స్ రంగాన్ని మరింత పారదర్శకంగా, సులభతరం చేయడమే లక్ష్యంగా బీమా సుగమ్ పోర్టల్ ను తీసుకొచ్చారు. దీని ద్వారా వివిధ రకాల ఇన్సూరెన్స్ సేవలను ఒకే వేదికపైకి తెచ్చే లక్ష్యంతో రూపొందించిన ఈ డిజిటల్ పోర్టల్‌ను IRDAI ప్రకటించింది.
ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు, ప్రీమియం చెల్లింపు, రెన్యువల్ లేదా క్లెయిమ్ సెటిల్‌మెంట్ వంటి ప్రక్రియలు ఎక్కువ పేపర్‌వర్క్, మధ్యవర్తుల ఆధిపత్యం కారణంగా సంక్లిష్టంగా ఉండేవి. కానీ బీమా సుగమ్ రాకతో పారదర్శకత, డిజిటల్ యాక్సెస్, వేగవంతమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పోర్టల్ ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ లాంటి అన్ని ఉత్పత్తులను ఒకే చోట పరిశీలించి కొనుగోలు చేయవచ్చు. వివిధ కంపెనీలు అందించే ఆఫర్లను ఇక్కడ వినియోగదారుడు నేరుగా పోల్చుకునే వీలు లభించడం వల్ల సరైన పాలసీని ఎంచుకోవడం మరింత సులభతరం కానుంది.
ALSO READ : ఐటీ కంపెనీలిచ్చే శాలరీ హైక్స్ ఫేక్ గ్రోత్ అంట..
పోర్టల్ ద్వారా సాధారణ ప్రజలకు ఇకపై మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా పాలసీని తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ విధానం ఏజెట్ల మోసాలను తగ్గించడంతో పాటు క్లెయిమ్ సెటిల్‌మెంట్ వేగంగా జరిగేలా చేస్తుంది. పాలసీ వివరాలు, రెన్యువల్ రిమైండర్లు, ప్రీమియం చెల్లింపులన్నీ ఒకే డాష్‌బోర్డ్‌లో చూడవచ్చు. ఇదే క్రమంలో ఏజెంట్లు కూడా తమ పనితీరును పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. కస్టమర్లకు వేగంగా సేవలు అందించడం, పేపర్‌వర్క్ తగ్గడం, నమ్మకాన్ని పెంపొందించుకోవడం వంటి ప్రయోజనాలు ఎజెంట్లకు దక్కనున్నాయి.
బీమా సుగమ్ ద్వారా భారత ఇన్సూరెన్స్ రంగం మొత్తం డిజిటల్ దిశగా మరింత ముందుకు దూసుకుపోయే అవకాశం ఉందని, పాలసీదారులకు నాణ్యమైన, తక్షణ సేవలు అందించడం సాధ్యపడుతుందని అధికారులు చెబుతున్నారు. భారత ప్రభుత్వ లక్ష్యం 2047 నాటికి అందరికీ ఇన్సూరెన్స్ చేరుకోవటానికి ఈ పోర్టల్ సహాయంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.