హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం: స్టూడెంట్ ను చితకబాదిన ఫ్లోర్ ఇంచార్జి..

హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం: స్టూడెంట్ ను చితకబాదిన ఫ్లోర్ ఇంచార్జి..

హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం జరిగింది.. ఫ్లోర్ ఇంచార్జి చితకబడటంతో దవడ ఎముక విరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఇంటర్ స్టూడెంట్. సెప్టెంబర్ 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. గడ్డి అన్నారంలోని నారాయణ జూనియర్ కాలేజీలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఫ్లోర్ ఇంచార్జి సతీష్ చితకబడటంతో దవడ ఎముక విరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు సాయి పునీత్ అనే విద్యార్ధి.  

సెప్టెంబర్ 15న మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో ఇద్దరు స్టూడెంట్స్ మధ్య జరిగిన  వాగ్వాదం విషయంలో కలుగచేసుకొని స్టూడెంట్స్ ను చితకబాదాడు ఫ్లోర్ ఇంచార్జి సతీష్. ఈ క్రమంలో సాయి పునీత్ కు దవడ ఎముక విరిగి తీవ్ర గాయమవడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.

ALSO READ : ఆ భార్యభర్తలిద్దరూ కానిస్టేబుళ్లు

ఈ ఘటనపై మలక్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సాయి పునీత్ కుటుంబసభ్యులు. తమ కుమారుడు దవడ ఎముక విరిగి  తిండి తినలేని పరిస్థితి ఏర్పడిందని,ఈ దాడికి పాల్పడిన  ఫ్లోర్ ఇంచార్జి సతీష్,నారాయణ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని  విద్యార్థి తల్లిదండ్రులు కోరారు. ఫ్లోర్ ఇంచార్జి సతీష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మలక్ పేట పోలీసులు.