వరల్డ్‌‌కప్ ‌‌లేకపోతే ఐపీఎల్‌‌కు చాన్స్‌‌!

వరల్డ్‌‌కప్ ‌‌లేకపోతే ఐపీఎల్‌‌కు చాన్స్‌‌!

బీసీసీఐ అపెక్స్ ‌‌కౌన్సిల్ ‌‌మెంబర్‌‌ అన్షుమన్‌‌ గైక్వాడ్‌‌

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఈ ఏడాది టీ20 వరల్డ్‌‌కప్‌‌ జరగడం డౌటేనని బీసీసీఐ అపెక్స్ ‌‌కౌన్సిల్ ‌‌మెంబర్ ‌‌అన్షుమన్ ‌‌గైక్వాడ్ ‌‌బుధవారం అన్నారు. ఒకవేళ మెగా టోర్నీ పోస్ట్‌‌పోన్ ‌‌అయితే ఐపీఎల్‌‌కు ఓ విండో దొరుకుతుందని చెప్పారు. అయితే దేశంలో అప్పుడున్న పరిస్థితులు ఐపీఎల్‌‌13వ ఎడిషన్ ఫ్యూచర్‌‌ను డిసైడ్ ‌‌చేస్తాయని గైక్వాడ్ ‌‌అభిప్రాయపడ్డారు. ‘ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది టీ20 వరల్డ్‌‌కప్ ‌‌జరగడం డౌటే. ఐపీఎల్ ‌‌గురించి ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేం. వరల్డ్‌‌కప్ ‌‌జరగాల్సిన అక్టోబర్‌‌–నవంబర్‌‌లోనే ఐపీఎల్‌‌కు చాన్సుంది. వరల్డ్‌‌కప్‌‌ను పోస్ట్‌‌పోన్‌‌లేదా రద్దు చేస్తే ఐపీఎల్‌‌కు ఓ విండో దొరుకుతుంది. కానీ ఇండియాలో అప్పడు పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే లీగ్ ‌‌జరుగుతుంది’ అని గైక్వాడ్‌‌అన్నారు. అంతేకాక కరోనా తర్వాత క్రికెట్‌‌చాలా మారిపోనుందని, ఆటగాళ్లు ఇందుకు మానసికంగా రెడీ అవ్వాలని గైక్వాడ్‌‌ సూచించారు. ‘ ఇకపై క్రికెట్ ‌‌ఇంతకుముందులా ఉండదు. అప్రోచ్‌‌ పూర్తిగా మారిపోతుంది. స్టేడియంలో జనం ఉండరు. ఖాళీ స్టేడియాల్లో ఆడడం క్రికెటర్లకు చాలా కష్టంగా అనిపిస్తుంది. క్రికెట్ ‌‌మొదలవ్వాలంటే ఇంకో నాలుగు నెలలు పట్టే అవకాశముంది. అందువల్ల పెర్ఫామెన్స్‌‌విషయంలో ప్లేయర్లు చాలా కష్టపడాల్సి ఉంది. మెంటల్‌‌గా రెడీగా ఉండకపోతే  చాలా కష్టపడాల్సి వస్తుంది’ అని గైక్వాడ్‌‌ పేర్కొన్నారు.

For More News..

ఆ దేశాలను ఏకాకిని చేయాలి: వెంకయ్యనాయుడు

వీడియో వైరల్: బెంగళూరులో వింత సప్పుడు

సిమ్ బ్లాక్ అయితదంటూ స్కూల్ టీచర్ కు ఫోన్ చేసి..