
- 2 వారాల కింద బల్దియాకు వచ్చిన కమిషనర్ ఇలంబర్తి
- అంతలోనే ఝార్ఖండ్ ఎలక్షన్ అబ్జర్వర్‌గా నియామకం
- మినహాయింపుపై క్లారిటీ ఇవ్వని కేంద్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఝార్ఖండ్ ఎన్నికల అబ్జర్వర్‌గా నియమితులైన జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అక్కడికి వెళ్లారు. మూడ్రోజుల కింద ఝార్ఖండ్ ఎన్నికల కమిషనర్‌కు రిపోర్ట్ చేశారు. రెండు విడతల్లో జరగనున్న ఝార్ఖండ్ ఎన్నికలకు కనీసం 25 రోజులపాటు పనిచేయాల్సి ఉంటుంది. మొన్నటి దాకా జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన ఆమ్రపాలి ఏపీకి వెళ్లడంతో రెండు వారాల కింద జీహెచ్ఎంసీ ఫుల్ అడిషనల్ కమిషనర్‌గా ఇలంబర్తి బాధ్యతలు చేపట్టారు.
ఆ వెంటనే జీహెచ్ఎంసీకి సంబంధించి స్టడీ చేయడం మొదలుపెట్టారు. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇలంబర్తికి ఝార్ఖండ్ బాధ్యతలు అప్పగించింది. అయితే ఇలంబర్తికి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం మినహాయింపు ఇస్తుందా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ రిలాక్సేషన్ ఇవ్వకపోతే తప్పనిసరిగా ఇలంబర్తి ఎన్నికల డ్యూటీ చేయాల్సి ఉంది. అదే జరిగితే జీహెచ్ఎంసీ కమిషనర్ గా మరొకరికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.