
న్యూఢిల్లీ: అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వైట్‌బాల్ ఫార్మాట్ కెప్టెన్ రోహిత్ శర్మకు.. టెస్ట్ జట్టు కెప్టెన్సీ కూడా అప్పగించే చాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం బీసీసీఐ ముందు సెకండ్ ఆప్షన్ లేకపోవడం, కేఎల్ రాహుల్ ఫెయిల్ కావడంతో రోహిత్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. అయితే 2022, 2023లో రెండు వరల్డ్‌కప్స్ ఉండటంతో వర్క్‌లోడ్ గురించి బీసీసీఐ ఆలోచిస్తున్నది. రాహుల్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓడిపోవడంతో.. మరోసారి అతనికి నాయకత్వం ఇచ్చేందుకు బోర్డు ఇష్టపడటం లేదు. ఇక నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఫిట్నెస్ సాధిస్తే వచ్చేనెల విండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు అందుబాటులోకి వచ్చే చాన్సుంది. అదే టైమ్‌లో స్టార్ పేసర్ బుమ్రాకు సెలెక్టర్లు రెస్ట్ ఇవ్వొచ్చు. ఈ సిరీస్‌ల కోసం రెండు మూడు రోజుల్లో టీమ్ సెలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.