రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ 

V6 Velugu Posted on Jun 17, 2021

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

నైరుతి, పశ్చిమ దిశల నుంచి బలంగా గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలపింది.

Tagged Telangana State, chance, three days rain

Latest Videos

Subscribe Now

More News