చట్టసభల్లో ప్రాతినిథ్యం లేకపోవడం విచారకరం : ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

చట్టసభల్లో ప్రాతినిథ్యం లేకపోవడం విచారకరం : ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
  • వడ్డెరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..
  • ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

నర్సంపేట, వెలుగు : వడ్డెరలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్​కోదండరాం తెలిపారు.  వడ్డెరుల ఆరాధ్యదైవం ఓబన్న 138వ జయంతి సందర్భంగా ఆదివారం వరంగల్​జిల్లా నర్సంపేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణాల నుంచి ప్రాజెక్టుల వరకు వడ్డెరుల పాత్ర చారిత్రాత్మకమని పేర్కొన్నారు.  ఇప్పటికీ వారికి చట్టసభల్లో ప్రాతినిథ్యం లేకపోవడం విచారకరమన్నారు. వడ్డెరుల సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో టీజేఏసీ ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్​, కాంగ్రెస్​ పార్టీ ఓబీసీ సెల్​ వరంగల్​ జిల్లా చైర్మన్​ ఓర్సు తిరుపతి, టీజేఎస్​స్టేట్​వైస్​ప్రెసిడెంట్ అంబటి శ్రీనివాస్​, కాంగ్రెస్​ఓబీసీ సెల్​చైర్మన్​ఓర్సు తిరుపతి, న్యాయవాది కొడిదెల సంజయ్​కుమార్​, ఓర్సు వెంకన్న, ఓర్సు సాంబయ్య, రాపోలు రాములు, సంపంగి సాలయ్య, గండికోట భిక్షపతి, ఓర్సు రాజేందర్​, దారంగుల కొమురయ్య, ఆలకుంట మురళీ, రమేష్​, విష్ణు తదితరులు పాల్గొన్నారు.