నేను ఫోన్, ఇంటర్నెట్ వాడను : నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్

నేను ఫోన్, ఇంటర్నెట్ వాడను :  నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్
  •     నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వెల్లడి

 న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తాను ఫోన్, ఇంటర్నెట్ వాడానని తెలిపారు. తన రోజువారీ కార్యకలాపాల్లో వాటికి చోటు లేదని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఈ మేరకు శనివారం భారత్ మండపంలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ సదస్సు–2026 ప్రారంభ సెషన్ లో అజిత్ దోవల్ మాట్లాడారు. 

యువకులను ఉద్దేశించి ప్రసంగించారు. “నేను ఇంటర్నెట్ వాడాననే మాట నిజమే. ఫోన్ కూడా వాడను. కుటుంబ సభ్యులు, ఇతర దేశాల్లోని ప్రజలతో మాట్లాడేందుకు మాత్రమే నేను కొన్ని సందర్భాల్లో ఫోన్ ను ఉపయోగిస్తాను. అవి రెండు లేకుండానే విధులు నిర్వర్తించేలా నేను ప్లాన్ చేసుకుంటాను. కమ్యూనికేషన్‌ కు ఇతర అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ప్రజలకు తెలియనివి ఎన్నో ఉన్నాయి” అని తెలిపారు. అజిత్ దోవల్ 1945లో ఉత్తరాఖండ్ లో జన్మించారు. 

1968లో ఐపీఎస్ లో చేరారు. విధుల్లో చూపిన ధైర్యసాహసాలకు ఆయన కీర్తిచక్ర అందుకున్నారు. ఆ అవార్డు అందుకున్న పిన్నవయస్కుడైన పోలీసు ఆఫీసర్ గా నిలిచారు. మిజోరం, పంజాబ్‌, ఈశాన్య ప్రాంతాల్లో చోటుచేసుకున్న తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించారు. కేరళ క్యాడర్‌కు చెందిన ఆయన నిఘా, అంతర్గత భద్రతా విభాగాల్లో సేవలు అందించారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్‌, 2019 బాలాకోట్ స్ట్రైక్స్‌ వంటి జాతీయ భద్రతా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు.