ఖజానా జ్యువెలరీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ .. ఒక పిస్టల్, 1,015 గ్రాముల ఆభరణాలు స్వాధీనం

ఖజానా జ్యువెలరీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ .. ఒక పిస్టల్, 1,015 గ్రాముల  ఆభరణాలు స్వాధీనం

చందానగర్, వెలుగు: చందానగర్​లోని గంగారం జాతీయ రహదారి వెంట ఉన్న ఖజానా జ్యువెలరీ షాప్​లో జరిగిన దోపిడీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్​ అయ్యారు. సైబరాబాద్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న ఖజానా జ్యువెలరీ షాప్​ ఓపెన్​ చేసిన వెంటనే ఆరుగురు దుండగులు ముఖానికి మాస్కులు ధరించి, గన్స్​తో చొరబడ్డారు. 

డిస్​ప్లేలలో ఉన్నవి బంగారు ఆభరణాలు అనుకొని బంగారు పూత ఉన్న 10 కేజీల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 12 ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఈ నెల 16న బిహార్​కు చెందిన ఇద్దరు నిందితులు ఆశిష్​కుమార్​సింగ్, దీపక్​కుమార్​సాహాను మహారాష్ర్టలోని పుణేలో అరెస్ట్​ చేశారు. 

వారి వద్ద నుంచి 900 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బిహార్​కే చెందిన అనీష్​కుమార్​సింగ్, ప్రిన్స్​కుమార్​ రజక్​ను పుణేలోని చాకన్, పింప్రిలో అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి ఒక పిస్టల్, 1,015 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ఎస్ వోటీ, సీసీఎస్, లా అండ్ ఆర్డర్​ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.