
చందానగర్, వెలుగు: హైదరాబాద్ నగరంలో నాలా ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝలిపిస్తోంది. శుక్రవారం నల్లగండ్ల చెరువు నుంచి చందానగర్ వరకు విస్తరించి ఉన్న లింగంపల్లి నాలా వెంట ఉన్న అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. నాలా విస్తరణను 16 మీటర్లుగా నిర్ణయించిన అధికారులు, ఆనుకొని వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో..
అబ్దుల్లాపూర్ మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కుంట్లూరు గ్రామంలో అక్రమ నిర్మాణాలను తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కూల్చేశారు. ప్రభుత్వ భూమిని అక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో ఈ చర్యలకు ఉపక్రమించారు. అనంతరం ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేశారు.