వరల్డ్ బిర్యానీ డే ఈ ఆదివారం (జూలై 6)నే.. మన హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ చేద్దామా..!

వరల్డ్ బిర్యానీ డే ఈ ఆదివారం (జూలై 6)నే.. మన హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ చేద్దామా..!

ప్రతి సంవత్సరం జూలై నెలలోని మొదటి ఆదివారాన్ని ప్రపంచ బిర్యానీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు..  ఈ సంవత్సరం ( 2025) మాత్రం జూలై 6 వ తేదీన బిర్యానీ దినోత్సవం వచ్చింది. ఆ రోజు ఆదివారంగా ఉంది. సో.. రేపు  ఆదివారం బిర్యానీ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా బిర్యానీ ప్రేమికులు.. దీన్ని ఆస్వాదించటానికి రెడీ అవుతున్నారు.జులై 6  ప్రపంచ బిర్యానీ దినోత్సవం సందర్భంగా స్పెషల్​ స్టోరి.

హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీలకే సెలబ్రిటీ... శతాబ్దాల నాటి బిర్యానీ ఎప్పటికప్పుడు నగరాన్ని రుచుల విశ్వంలో రారాజుగా నిలబెడుతూనే ఉంది.  బిర్యానీ పేరు వినిపిస్తే హైదరాబాద్ గుర్తుకొస్తుంది. ఈ టేస్ట్ ఎన్ని దేశాలు తిరిగినా దొరకదు. హైదరాబాద్​లో  అడుగుపెట్టినవాళ్లని 'మీకేం కావాలి?' అంటే 'బిర్యానీ' అని మనసులోని కోరికను క్షణాల్లో చెబుతారు. 'గోల్కొండ కోట, అందమైన ప్యాలెస్ లను తర్వాత చూద్దాం! ఆ రాయల్ కిచెన్లో పుట్టిన హైదరాబాద్ బిర్యానీని ముందు ఆరగిద్దాం' అంటారు. 

హైదరాబాద్లో ఏ గల్లీలో నడిచినా బిర్యానీ ఘుమఘుమలే ముక్కుపుటల్ని తాకుతాయి. హైదరాబాద్ బిర్యానీ తినలేదంటే.. జీవితంలో మంచి టేస్ట్ మిస్ అయినట్లేనని పుడీస్ అంటరు. ఈ బిర్యానీ కోసం వాడే మిర్చి, మసాలా, ఇతర స్పైసెస్ చాలా ప్రత్యేకం. 

వండే తీరు కూడా ఇతర బిర్యానీల కంటే డిఫరెంట్ ఉంటది. 'హైదరాబాద్ బిర్యానీ' అని వరల్డ్ ఫేమస్ కావడానికి ఇదే కారణం. బిర్యానీ ఇక్కడ పుట్టిందనడానికి ఆధారాలు లేవని హైదరాబాద్ బిర్యానీకి జీవి ట్యాగ్ ఇవ్వడానికి మూడేళ్ల కింద నిరాకరించినరు. బిర్యానీ ఎక్కడ పుట్టినా, మరచిపోలేనంత రుచిగా హైదరాబాద్​ లో నే మారింది! బిర్యానీ అంటే హైదరాబాద్! హైదరాబాద్ అంటే బిర్యానీ

దక్కన్​ ని  పాలించిన మొదటి నిజాంకి బిర్యానీ అంటే చానా ఇష్టం. అందుకే రాయల్ కిచెన్ బిర్యానీ వండేటోళ్లు. ఈ సంప్రదాయాన్ని ఆ తర్వాత నిజాములూ కంటిన్యూ చేసినారు. అట్ల నిజాం రాజుల చీఫ్ చెఫ్​ లు.. చేపలు, జింకలు, రొయ్యలు, ఊరేడు పిట్ట, కుందేలు, చికెన్, మటన్, బీఫ్ తో 50 రకాల బిర్యానీలను తయారు చేశారు. వాళ్ల కృషే హైదరాబాద్ బిర్యానీని యూనిక్ గా నిలబెట్టింది. మొఘలుల మూలాలున్న లక్నో, కలకత్తా బిర్యానీలని వెనక్కినెట్టి.. మన బిర్యానీ వరల్డ్ ఫేమస్ గా నిలబడింది.

బిర్యానీ అంటే?..

బిర్యానీ ఎక్కడ పుట్టింది అనేదానికి ఇప్పటివరకు ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా... దీని మూలాలు మాత్రం పశ్చిమాసియాలో ఉన్నాయి. బిర్యానీ పర్షియన్ పదం నుంచి వచ్చినది. బిర్యాన్ అంటే... ఉడికించడానికి ముందు ఫ్రై చేయడం  అని అర్ధం. బిరింజీ అంటే 'రైస్' అని అర్థమట..!

ALSO READ : ఫస్ట్ డే తమ్ముడుకు దారుణమైన కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

1398లో టర్కీ వాళ్లకు, మంగోలియన్స్​ కు  మధ్య జరిగిన యుద్దాల్లో సైనికులకు బిర్యానీ డైట్​ గా  ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి.  ఇది బలవర్థకమైన ఆహారం కాబట్టి సైనికుల కోసం తయారు చేశారని అంటున్నారు.   టర్కీ యుద్ధం తర్వాత చాలామంది రాజులు యుద్ధ సమయంలో బిర్యానీని సైనికులకువండించి, వడ్డిస్తూ వచ్చినరు.

మొఘలులు తీసుకొచ్చారట

బిర్యానీని మన దేశానికి తీసుకొచ్చింది. మొఘల్ చక్రవర్తులే. ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వచ్చిన మొఘలులు.. వస్తూ ఆఫ్ఘాన్ స్పైసెస్ తీసుకొచ్చినారు. ముందుగా వాటితోనే బిర్యానీ చేసేవాళ్లు  తర్వాతి కాలంలో మన దేశంలో లభించే స్పైసెస్​ తో  బిర్యానీ వండటం మొదలు పెట్టినరు. మొఘల్స్ రాయల్ కిచెన్​ లో  రోజూ బిర్యానీ ఘుమఘుమలు పొగలు కక్కేవి. కలకత్తా, లక్నో బిర్యానీల్లో-మొఘలుల బిర్యానీ తాలూకు మూలాలు ఉన్నయి.. టిప్పు సుల్తాన్ వెజిటేరియన్ హిందూ చెఫ్ ని తన ఆస్థానంలో పెట్టుకోవడం వల్ల... తహ్రాయి వెజిటబుల్ బిర్యానీ తయారైంది. 

రాయల్ కిచెన్ టు రెస్టారెంట్స్

రాయల్ కిచెన్స్ లో రాజులకు ఇష్టమైన ఫుడ్ ఎప్పుడూ పొయ్యి మీద ఘుమఘుమలాడుతూనే ఉండేది. అలాంటి వాటిలో బిర్యానీ కూడా ఒకటి. వందల ఏళ్లు బిర్యానీ రాయల్ ఫుడ్స్ గానే కిచెన్​ ను ఏలింది. పూర్వం రాయల్ ఫ్యామిలీ, ధనవంతులే బిర్యానీ తినేవాళ్లు. రాచరికం పోవడంతో నెమ్మదిగా ఆ బిర్యానీ.. రాయల్ కిచెన్స్ దాటి రెస్టారెంట్స్ లోకి అడుగుపెట్టింది..మరి ఇంకెందుకు ఆలస్యం వరల్డ్​ బిర్యానీడే  సందర్భంగా  హైదరాబాద్​ బిర్యానీ టేస్ట్​ చేసేద్దాం. . .!