టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. నటి శిరీష లేళ్లతో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. నారా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న నారా రోహిత్.. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన వివాహానికి రావాలని సీఎంను ఆహ్వానించారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక..
నారా రోహిత్ - శిరీషల వివాహం ఈ నెల అక్టోబర్ 30న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహ వేడుకలను ఏకంగా నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నారా కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 25న హల్దీ వేడుకతో పెళ్లి సంబరాలు మొదలవుతాయి. అక్టోబర్ 26న సంప్రదాయబద్ధంగా పెళ్లికొడుకు కార్యక్రమం జరగనుంది. అక్టోబర్ 28న మెహందీ వేడుక, 29న సంగీత్ నైట్ నిర్వహించనున్నారు. చివరగా, అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు శుభ ముహూర్తాన రోహిత్, శిరీష ఒక్కటవ్వనున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - భువనేశ్వరి దంపతులు పెద్దలుగా ఈ వివాహ వేడుకలో పాల్గొననున్నారు.
'ప్రతినిధి-2' సెట్స్‌లో చిగురించిన ప్రేమ బంధం
రోహిత్, శిరీషల పరిచయం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. వారిద్దరూ కలిసి నటించిన 'ప్రతినిధి–2' సినిమా షూటింగ్ సమయంలోనే స్నేహం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో గత ఏడాది అక్టోబర్ 13న హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే, నిశ్చితార్థం జరిగిన కొద్ది కాలానికే రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూయడంతో పెళ్లిని వాయిదా పడింది. దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి తేదీ ఖరారు చేశారు. సినీ పరిశ్రమలో ఈ వివాహం'ఈ ఏడాది అత్యంత ఆకర్షణీయమైన స్టార్ వెడ్డింగ్'గా నిలవనుంది.
Actor @IamRohithNara met Honourable Chief Minister Sri A. @revanth_anumula and invited him to his wedding.
— Jacob Ross (@JacobBhoompag) October 24, 2025
Nara Rohith’s marriage is scheduled to take place on October 30.
Minister Sri @Tummala_INC CM Chief Advisor @Vemnarenderredy were present on the occasion. pic.twitter.com/NvwBUcmZM1
