Thammudu Box Office: ఫస్ట్ డే తమ్ముడుకు దారుణమైన కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Thammudu Box Office: ఫస్ట్ డే తమ్ముడుకు దారుణమైన కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

నితిన్ నటించిన తమ్ముడు మూవీ చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ సాధించలేకపోయింది. తొలిరోజు  (జూలై 4న) ఇండియాలో రూ.2 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రూ. 4 కోట్ల లోపే గ్రాస్ వసూళ్లు చేసినట్లు తెలిపాయి. అయితే, తమ్ముడు మూవీ వరల్డ్ వైడ్‌గా 950 వరకు థియేటర్లలో భారీగా విడుదలైంది. కేవలం 27 వేల లోపే టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయినట్లు సమాచారం.

అంతేకాకుండా, చెక్, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద దారుణఫలితాన్ని అందుకున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన తమ్ముడు వంటి ఎమోషనల్, యాక్షన్ థ్రిల్లర్.. వీటికంటే తక్కువ వసూళ్లు చేయడం షాక్ ఇస్తుంది.

నితిన్ దశాబ్దకాలంలో అతి తక్కువ ఓపెనింగ్:

రాబిన్‌హుడ్ (రూ.2.3 కోట్లు),
ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (రూ.2.5 కోట్లు),
మాచర్ల నియోజకవర్గం (రూ.6.25 కోట్లు),
చెక్ (రూ.3.37 కోట్లు). 
తమ్ముడు (రూ.2 కోట్లు) 

సాక్నిల్క్ వెబ్‌సైట్ ప్రకారం:

జులై 4న థియేటర్లలో రిలీజైన తమ్ముడు ఫస్ట్ షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు 2D షోలకు మొత్తం 19.91% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఉదయం షోలకు 22.48% నమోదు చేయగా, మధ్యాహ్నం 20.17%, సాయంత్రం: 18.10% ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. హైదరాబాద్ లో మొత్తం 23.25% ఆక్యుపెన్సీతో ముందంజలో ఉంది. అయితే, వరుస సినిమాల ఫెయిల్యూర్స్ తో నితిన్ కష్టకాలంలో ఉన్నాడు. మరి నితిన్ తమ్ముడితో గట్టెక్కుతాడా? లేదా అనేది చూడాలి. 

తమ్ముడు కథ:

ఆర్చరీలో గోల్డ్ మెడల్ కొట్టాలన్నది జై (నితిన్) లక్ష్యం. కానీ చిన్నప్పుడు తను చేసిన తప్పు వల్ల అక్క ఝాన్సీ (లయ) దూరం అయిందనే గిల్ట్తో టార్గెట్పై ఫోకస్ పెట్టలేకపోతాడు. దీంతో చిత్ర (వర్ష బొల్లమ్మ) తో కలిసి అక్కను వెతుక్కుంటూ వైజాక్ వెళ్తాడు. ఆమెతో "తమ్ముడు" అని పిలిపించుకోవాలి అనుకుంటాడు. ఆంధ్రా, ఛత్తీస్ గడ్ బోర్డర్ లోని అడవిలో ఉన్న అంబర గొడుగులో అమ్మవారి మొక్కు చెల్లించుకునేందుకు ఆమె ఫ్యామిలీతో కలిసి వెళ్తుంది.

►ALSO READ | అందర్నీ థ్రిల్ చేసేలా ‘మిస్టీరియస్’ మూవీ

గవర్నమెంట్ ఆఫీసర్ అయిన ఆమెను కుటుంబంతో సహా చంపేందుకు పారిశ్రామిక వేత్త అజర్వాల్ (సౌరబ్ సచదేవ్) మనుషులు వెంట పడుతుంటారు. వాళ్ళు ఎందుకు తనను చంపాలి అనుకున్నారు? వాళ్ల నుండి తన అక్క కుటుంబాన్ని జై ఎలా కాపాడుకున్నాడు.?ఇందుకు రత్న (సప్తమి గౌడ) ఎలా సహాయపడింది? ఇందులో గుత్తి (స్వసిక) పాత్ర ఏమిటి అనేది మిగతా కథ.