అందర్నీ థ్రిల్ చేసేలా ‘మిస్టీరియస్’ మూవీ: డైరెక్టర్ మహి కోమటిరెడ్డి

అందర్నీ థ్రిల్ చేసేలా ‘మిస్టీరియస్’ మూవీ: డైరెక్టర్ మహి కోమటిరెడ్డి

సీనియర్ నటుడు నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోగా ‘బిగ్ బాస్’ ఫేమ్ రోహిత్ సహాని జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్టీరియస్’. రియా కపూర్, మేఘనా రాజ్‌‌‌‌పుత్ మరో జంటగా నటిస్తున్నారు.  మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో ఉషా, శివాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా, తాజాగా టీజర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌లో దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘సస్పెన్స్ జానర్‌‌‌‌‌‌‌‌లో వస్తోన్న ఈ సినిమా ఆడియెన్స్‌‌‌‌కి  సరికొత్త ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ని అందిస్తుంది. 

 టీజర్‌‌‌‌‌‌‌‌కి మంచి రెస్పాన్స్‌‌‌‌ రావడంతో సినిమాపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది’ అని అన్నాడు. అందర్నీ థ్రిల్ చేసేలా  సినిమా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రంలో నటించడం హ్యాపీగా ఉందని, ప్రేక్షకులు తమను బ్లెస్ చేస్తారని భావిస్తున్నాం’ అని నటీనటులు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.