వన్డే వరల్డ్ కప్ లో డూ ఆర్ డై మ్యాచ్ లో న్యూజిలాండ్ కు భారత్ మహిళల జట్టు భారీ టార్గెట్ ను నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా వర్షం కారణంగా 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రతికా రావల్ 122 పరుగులు, స్మృతి మంధాన 109 పరుగులు, జెమ్మీ రోడ్రిగస్ 76 పరుగులతో చెలరేగడంతో ఇండియా భారీ స్కోర్ చేసింది.
వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ సిద్ధాంతం(డీఎల్ఎస్) ప్రకారం న్యూజిలాండ్ టార్గెట్ ను 44 ఓవర్లలో 325 కు కుదించారు. టార్గెట్ చేధనలో న్యూజిలాండ్ ఓపెనర్ బేట్స్ ఒక పరుగుకే ఔటయ్యింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 11 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. సోఫీ డివైన్6, అమెలియా కెర్ 19 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
