
సాధారణంలో రోడ్లు దెబ్బతిన్నప్పుడు కొత్తగా రోడ్లు వేస్తుంటారు. అప్పుడు ఒక్కోసారి రోడ్డు ఎత్తు పెరుగుతాయి. అలాంటప్పుడు రోడ్డు ఎక్కువ ఎత్తులో ఉండి.. ఇల్లు తక్కువ ఎత్తులోకి వస్తుంది. అలా ఉంటే వాస్తు పరంగా ఏమైనా ఇబ్బందులున్నాయా.. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ ఏమంటున్నారో చూద్దాం
ప్రశ్న: మా ఇంటి ముందు రెండు సార్లు రోడ్డు పోయడం వల్ల ఇంటి కంటే రోడ్డే ఎత్తయింది. మాది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఇంటికి నార్త్ బాత్రూమ్ లు కట్టించాలని మట్టి తోలించాం.ఇంటి ముందున్న రోడ్డు, ఇంటి కంటే ఎత్తులో ఉండొచ్చా? నార్త్ లో మట్టి వేయించడం వల్ల సమస్యలు వస్తాయా? టాయిలెట్స్ అక్కడ కట్టించుకోవచ్చా?
జవాబు : ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటే ఇంటి ముందున్న రోడ్డు.... ఇంటి కంటే ఎక్కువ ఎత్తులో ఉండకూడదు. కనీసం రెండూ సమానంగానైనా ఉండాలి. .. ఇల్లు.. రోడ్డు కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలి. ఇంటి స్థలంలో తూర్పు, ఉత్తరం ఒకే స్థాయిలో... రోడ్డుకంటే ఎక్కువ ఎత్తులో ఉండాలి. మట్టి తోలించారు కాబట్టి ఎత్తు పల్లాలు లేకుండా సమానంగా ఉండేలా చూసుకొని బాత్రూమ్ లు కట్టించుకోండి. వాయువ్యంలో ఉంటాయి కాబట్టి తప్పులేదు