Yevam OTT: ఓటీటీలోకి వస్తోన్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..స్ట్రీమింగ్ వివరాలివే

Yevam OTT: ఓటీటీలోకి వస్తోన్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..స్ట్రీమింగ్ వివరాలివే

కలర్ ఫొటో ఫేమ్ చాందిని చౌద‌‌‌‌రి (Chandini Chowdary), వ‌‌‌‌శిష్ట సింహా, భరత్‌‌‌‌రాజ్‌‌‌‌, అషు రెడ్డి లీడ్ రోల్స్‌‌‌‌లో నటించిన చిత్రం ‘యేవమ్‌‌‌‌’. ఏది మంచి, ఏది చెడు అనేది ట్యాగ్‌‌‌‌లైన్. ప్రకాష్‌‌‌‌ దంతులూరి డైరెక్ట్ చేసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ను నవదీప్‌‌‌‌, పవన్‌‌‌‌ గోపరాజు నిర్మించారు. ఈ మూవీ జూన్ 14న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడీ ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది.

తాజాగా ఆహా ఓటీటీ యేవమ్‌‌‌‌ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. "నేరస్థుడు ఎవరైనా తప్పించుకోలేరు..ఇన్‌స్పెక్టర్ సౌమ్య జులై 25న ఛార్జ్ తీసుకుంటోంది" అనే క్యాప్షన్ తో ఆహా ఓటీటీ ఈ యేవమ్ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీని తెలిపింది. 

ప్రముఖ నటి చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో మొదలైన ఆమె ప్రయాణం ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటీవలే ఆమె హీరోయిన్ గా వచ్చిన గామి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది.

తాజాగా ఆమె నుండి వచ్చిన మరో రెండు సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను అలరింపజేస్తున్నాయి. అందులో మ్యూజిక్ షాప్ మూర్తి(Music Shope Murthy) సినిమా ఒకటి ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ వీడియో రెండు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా..మరొక యేవమ్‌‌‌‌ మూవీ జులై 25న రానుంది. ]