
ఖైరతాబాద్, వెలుగు : హైటెక్‌సిటీలో సైబర్‌టవర్ నిర్మించి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబుకు కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్టు ఐటీ ఉద్యోగులు తెలిపారు. ఆయనపై అభిమానంతో సభను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఐటీ ఉద్యోగులు జయచంద్ర, శశిధర్ పాల్గొన్నారు.