Vastu tips: ఇంట్లో మెట్లు ఆగ్నేయంలో ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..!

Vastu tips: ఇంట్లో మెట్లు ఆగ్నేయంలో ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..!

ఇంట్లో మెట్లు ఏదిక్కులో ఉండాలి.  రెండు మూడు అంతస్థుల బిల్డింగులకు మెట్లు ఎటు ఉండాలి.. లిఫ్ట్​ ఎటు ఉండాలి.. ఆగ్నేయంలో మెట్లు ఉంటే మూడో అంతస్తులో ఉండే వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయా..  ఈ విషయంలో వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న: మేం థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నాం. ఇంటి ఆగ్నేయంలో దిగడానికి మెట్లు ఉన్నాయి. లిఫ్ట్ కూడా అటువైపే ఉంది. ఈ అపార్ట్ మెంట్ లోకి వచ్చినప్పటి నుంచి నా భార్యకు, మా అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు. ఇంటి మెట్లకు, స్త్రీల ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా?

జవాబు: మెట్లు ఇంటికి ఆగ్నేయంలో ఉండటం వల్ల నష్టం లేదు. మీ ఇంటికి ఉన్న లిఫ్ట్ వల్ల కూడా స్త్రీలకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు. వాస్తు ప్రకారం కిచెన్, బాత్రూమ్లు సరిగా లేకపోతే ఇంట్లోని ఆడవాళ్ల ఆరోగ్యం దెబ్బతినొచ్చు.. ఒక్కసారి మీకు దగ్గర్లో ఉన్న వాస్తు సిద్ధాంతిని పిలిపించి వాటిని చెక్ చేయించుకోండి.

►ALSO READ | Taste Food: వెరైటీ సమోసాలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా.. ఎలా తయారు చేయాలంటే..!