స్టూడెంట్సే టార్గెట్.. రంగు రంగుల గంజాయి చాక్లెట్లు, పొట్లాలు.. షాద్నగర్లో భారీగా గంజాయి పట్టివేత

స్టూడెంట్సే టార్గెట్.. రంగు రంగుల గంజాయి చాక్లెట్లు, పొట్లాలు..  షాద్నగర్లో భారీగా గంజాయి పట్టివేత

తెలంగాణలో గంజాయి పేరు వినిపించకూడదనే లక్ష్యంతో ఎక్సైజ్ శాఖ పనిచేస్తోంది. గంజాయి, డ్రగ్స్ పేరు ఎత్తాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన తర్వాత.. అధికారులు దాడులు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ గంజాయి ముఠాలను కట్టడి చేస్తూ.. అమ్మకాలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం మొదలు పెట్టారు దుండగులు. శనివారం (జులై 05) షాద్ నగర్ లో గంజాయి చాక్లట్లతో పాటు గంజాయి ప్యాకింగ్ లతో పట్టబడటం కలకలం రేపింది.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ  పారిశ్రామిక వాడలో  ఎక్సైజ్ పోలీసులు శనివారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ శేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా 2 కిలోల గంజాయి తో పాటు 9 కిలోల గంజాయి చాకోలెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా   ఎక్సైజ్ డీపీఓ ఉజ్వల మాట్లాడుతూ.. నందిగామ పారిశ్రామికవాడలో ఒక చిన్న హోటల్లో  గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం వచ్చినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు.. దాడులు నిర్వహించి గంజాయి అమ్ముతున్న వ్యక్తులను పట్టుకున్నట్లు చెప్పారు.  గంజాయి అమ్ముతున్న పింటూ సింగ్ అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు  తెలిపారు. 

ALSO READ : WAR2: ఎన్టీఆర్ అభిమానులంతా సిద్ధంగా ఉండండి.. నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ అప్డేట్

స్కూల్, కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్ముతున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. అదే విధంగా స్టూడెంట్స్ గంజాయి కి దూరంగా ఉండేలా.. పాఠశాలలో, కళాశాలల్లో గంజాయి సేవిస్తే కలిగే అనర్థలపై అవగాహన కార్యక్రమాలు చెపడతామని తెలిపారు.

ధూల్పేటలో గంజాయి పూజ.. దేవుడి పటాల వెనుక దాచి అమ్మకాలు:

గంజాయి అమ్మకాల్లో దుండగులు కొత్త పంతాను ఎంచుకున్నారు. దేవుడి చిత్ర పటాల వెనుక గంజాయి దాచి అమ్మకాలు జరుపుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా దేవుని పటాల వెనుక దాచి పూజలు చేస్తున్నట్లు నటిస్తూ గంజాయి అమ్మటం చూసి పోలీసులు షాక్ అయ్యారు.

శనివారం (జులై 05) హైదరాబాద్ ధూల్ పేటలో గంజాయి అమ్మకాలు జరుగుతన్నట్లు తెలుసుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ పోలీసుల సమాచారం తెలుసుకున్న దుండగులు దేవుని చిత్రపటాల వెనుక దాచే ప్రయత్నం చేయడంతో కొంత హైడ్రామా నడిచింది. రోహన్ సింగ్ అనే వ్యక్తి ఒడిస్సా నుంచి గంజాయి తెచ్చి పూజలు చేయటం ఆశ్చర్యానికి గురిచేసింది. 

గంజాయి ఉందన్న అనుమానంతో ఇంట్లో సోదాలు  చేస్తుంటే.. పూజల చేయడం పైన   ఎక్సైజ్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో రోహన్ సింగ్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు నిజం చెప్పి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో దేవుడి చిత్రపటాలు తీసి చూడగా.. పటాల వెనుక పెద్ద మొత్తంలో గంజాయి లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు. 

ఒడిశా నుం తెచ్చిన గంజాయి ధూల్ పేట నుంచి గచ్చిబౌలి వరకు తీసుకువెళ్లి అమ్ముతున్నట్లు రోహన్ సింగ్ ఒప్పుకున్నాడు. దీంతో రోహన్ సింగ్ ని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ , 10 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకుంది.

సూర్యాపేట జిల్లాలో రూ.3 కోట్ల గంజాయి సీజ్:-

సూర్యాపేట జిల్లా కోదాడ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా యువతను టార్గెట్ చేస్తూ.. గంజాయి  విక్రయిస్తున్న ఇద్దరు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.  నిందితుల నుంచి రూ.2.8 లక్షల విలువైన 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.