WAR2: ఎన్టీఆర్ అభిమానులంతా సిద్ధంగా ఉండండి.. నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ అప్డేట్

WAR2: ఎన్టీఆర్ అభిమానులంతా సిద్ధంగా ఉండండి.. నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ అప్డేట్

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ‘వార్‌ 2’(War2) పై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే వార్ 2 టీజర్ రిలీజై మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వార్ 2కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు (జులై5న) నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ హైప్ క్రియేట్ చేశారు.  ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్‌పై ‘వార్‌ 2’ పెద్దఎత్తున రిలీజ్ చేయనున్నట్లు నాగవంశీ తెలిపారు. 

ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ పోస్ట్‌ పెట్టారు. ‘‘ప్రియమైన అభిమానులారా... సిద్ధంగా ఉండండి. నాకెంతో ఇష్టమైన తారక్‌ మూవీతో మళ్లీ మీ ముందుకురావడం ఆనందంగా ఉంది. అరవింద సమేత వీర రాఘవ, దేవర వంటి సినిమాలు మా బ్యానర్‌పై విడుదలై మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఇపుడు హ్యాట్రిక్ కోసం సమయం ఆసన్నమైంది. వార్ 2 అప్డేట్స్ కోసం అభిమానులంతా సిద్ధంగా ఉండండి. ‘వార్‌ 2’లో మీరు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ఎన్టీఆర్‌ను చూడనున్నారు. ఆగస్టు 14న సంబరాలు చేసుకుందాం. ఆ క్షణాన్ని హృదయపూర్వకంగా కదిలిద్దాం’’ అని నాగవంశీ ఓ వీడియోను షేర్  చేశాడు. ఈ క్రేజీ అప్డేట్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీలో ఉన్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్గా దాదాపు 7,500 స్క్రీన్‌లలో దీన్ని రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. 

ALSO READ : మంచు విష్ణు 'కన్నప్ప'కు ఓటీటీ షరతులు: రేసులో ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్?

యాక్షన్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2 మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో ఇండియన్ రా ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపిస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండటం, సూపర్ హిట్ 'వార్' సినిమాకు సీక్వెల్గా 'వార్ 2' వస్తుండటం సినీ వర్గాల్లో అంచనాలు పెరిగాయి. YRK స్పైవర్స్ లో భాగమైన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న వెండితెరపైకి రానుంది.