
స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు విచారించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు 4 వారాల సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరగా.. తదుపరి విచారణను FEB 12కి వాయిదా వేసింది.
ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. దీనిపై ఈరోజు ( జనవరి 19) సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. ఈ కేసును ఫిబ్రవరి 9కి వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోరారు. ఫిబ్రవరి 9న తనకు మరో కేసు ఉందని ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు తెలపగా.. ఫిబ్రవరి 12కు వాయిదా వేయాలని హరీశ్ సాల్వే విజ్ఞప్తి చేయడంతో.. ధర్మాసనం అంగీకరించింది. దీంతో తదుపరి విచారణ ఫిబ్రవరి 12న జరగనుంది.
కంటి చికిత్స, ఇతరత్ర ఆరోగ్య సమస్యల దృష్ట్యా స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు అక్టోబర్ 31వ తేదీన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆపై ఆ బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా మారుస్తూ నవంబర్ 20వ ఆదేశాలు ఇచ్చింది. అయితే.. బెయిల్‌పై ఏపీ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టు తన పరిధిని దాటిందని పేర్కొంటూ ఆ మరుసటి రోజే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిందిఏపీ ప్రభుత్వం. స్కిల్ కేసులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో నారా చంద్రబాబుని ప్రతివాదిగా చేర్చింది. ఈ ఎస్‌ఎల్‌పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది.