సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా... ఏ కేసులో అంటే...

సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా... ఏ కేసులో అంటే...

ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 20న (శుక్రవారం) దీనిపై విచారిస్తామని సుప్రీం తెలిపింది. అంత వరకూ ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చెయ్యొద్దని సర్వోన్నత న్యాయస్థానం సీఐడీని ఆదేశించింది.

హైకోర్టులోనూ వాయిదా

మరోవైపు, స్కిల్ స్కాం కేసులోనూ చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మంగళవారం  (అక్టోబర్ 16) విచారణ జరగ్గా, తదుపరి విచారణను ఈ నెల 19కు వాయిదా వేసింది. అలాగే, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబు తరఫు లాయర్ల పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది.