చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణ 19కు వాయిదా

చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణ 19కు వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు.. బెయిల్ కావాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వర్గాల వాదననలు విన్న హైకోర్టు.. విచారణను 2023, అక్టోబర్ 19వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆ రోజు పూర్తి వాదనలు వింటామని స్పష్టం చేసింది. పిటీషన్ పై వాదనలను పూర్తి స్థాయిలో వినిపించేందుకు.. సమయం కావాలన్న చంద్రబాబు తరపు లాయర్ల అభ్యర్థనతోనే.. బెయిల్ పిటీషన్ పై విచారణను రెండు రోజులు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకున్నది.

బెయిల్ పిటీషన్ పై పూర్తి వాదనలకు చంద్రబాబు తరపు లాయర్లు సమయం కోరటం వెనక కారణం లేకపోలేదు. 17ఏ, 409 సెక్షన్లపై సుప్రీంకోర్టులో పిటీషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా 17ఏ సెక్షన్ కింద అత్యున్నత న్యాయస్థానం విచారణ పెండింగ్ లో ఉంది.  దీనిపై తుది వాదనలు సుప్రీంకోర్టులో ఉన్నాయి. అది కూడా 17వ తేదీ మంగళవారం మధ్యాహ్నం తర్వాత.. వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగా.. బెయిల్ పిటీషన్ పై వాదనలు వినిపించేందుకు.. చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టులో సమయం కోరారు. దీంతో హైకోర్టు.. బెయిల్ పిటీషన్ పై విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. 

ALSO READ : చంద్రబాబు బెయిల్ పిటీషన్పై నేడు(అక్టోబర్ 17) సుప్రీంలో తుది వాదనలు
 

ప్రస్తుతం చంద్రబాబు 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో ఆయన్ను అరెస్ట్ చేశారు సీఐడీ అధికారులు.