సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు శుభాకాంక్షలు...

సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు శుభాకాంక్షలు...

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన  రేవంత్ రెడ్డికి టిడిపి అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 7వ తేదీ గురువారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి చేత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. 

ఉపముఖ్యమంత్రిగా  భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకరం చేయగా.. సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు ట్వీట్టర్ వేదికగా.. సీఎం రేవంత్ కు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా  సీఎం రేవంత్ రెడ్డికి  హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. 
  

రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలతోపాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు.