సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన చంద్రబాబు

సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన చంద్రబాబు

క్వాష్‌ పిటిషన్‌పై  ఏపీ హైకోర్టు తీర్పును  సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ వేశారు.  చంద్రబాబు తరపున న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు.  
 సీఐడీ కస్టడీ ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో చంద్రబాబు లంచ్  మోషన్ పిటిషన్ వేయగా .. దర్యాప్తు తుది దశలో జోక్యం చేసుకోలేమంటూ సెప్టెంబర్ 22న క్వాష్ పిటీషన్ ను కొట్టేసింది. దీంతో  ఇవాళ కాసేపటి క్రితం సుప్రీం కోర్టులో చంద్రబాబు తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సెప్టెంబర్ 25న విచారణకు వచ్చే అవకాశం ఉంది. 

మరో వైపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు సీఐడీ విచారణ కొనసాగుతోంది. జైలు కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ సమక్షంలో చంద్రబాబు విచారణ జరుగుతోంది. గంటకు ఐదు నిముషాల పాటు చంద్రబాబుకు విరామం ఇస్తున్నారు. మధ్యాహ్నం 1  గంట  నుంచి 2 గంటల వరకు లంచ్ విరామం.  రెండు రోజుల పాటు  చంద్రబాబును సీఐడీ విచారించనుంది.  

ALSO READ : ఇకపై అమెజాన్లో యాడ్స్ మోత.. ప్రైమ్ యూజర్స్కు షాక్

స్కిల్ డెవ్ లప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు 371 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ అభియోగాలు మోపింది.  అందుకు సంబంధించిన  అంశాలపై  చంద్రబాబును ప్రశ్నించనుంది. వాటికి చంద్రబాబు చెప్పే సమాధానాలను రికార్డ్ చేయనుంది.  సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది.