పోలవరం– నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌‌‌‌కు అనుమతి ఇవ్వండి: ఏపీ సీఎం చంద్రబాబు

పోలవరం– నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌‌‌‌కు అనుమతి ఇవ్వండి: ఏపీ సీఎం చంద్రబాబు
  • గోదావరి వరద జలాల మళ్లింపు కోసం ఆర్థిక సాయం చేయండి
  • కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, నిర్మలకు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
  • ఢిల్లీ పర్యటనలో ఏడుగురు మంత్రులతో సీఎం భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: గోదావరిపై నిర్మించతలపెట్టిన పోలవరం – నల్లమలసాగర్ (బనకచర్ల) లింక్ ప్రాజె క్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతులు, ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే ఈ ప్రాజెక్టుకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. 

ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం వరుసగా ఏడుగురు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ప్రధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భేటీలో పోలవరం–నల్లమలసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విజ్ఞప్తులు అందజేశారు.  గోదావరి నదికి వచ్చే వరద జలాల్లో 200 టీఎంసీల నీటిని పోలవరం ఆనకట్ట నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించడమే లింక్  ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఆర్థిక మంత్రికి వివరించారు. 

ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో కరువు నివారణ సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. 3 దశలుగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అయ్యే వ్యయాన్ని వివరించారు. ప్రాజెక్టుకు ఇప్పటికే జలహారతి కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశామని, దీనికి సంబంధించి ప్రాథమిక ప్రాజెక్టు రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించినట్లు చెప్పారు. దీనికి ఆమోదం తెలిపిన వెంటనే డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సమర్పిస్తామని వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రుణ సహకారం అందించిన తరహాలోనే ఈ ప్రాజెక్టుకు కూడా చేయూత అందించాలని కేంద్రాన్ని కోరారు.  

సాగునీటి ప్రాజెక్టుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తులివ్వాలి

కేంద్ర జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై చర్చించారు. ప్రత్యేకించి పోలవరం –బనకచర్లతో పాటు విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని కోరారు. 

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్రమంత్రికి వివరించారు. రెండో దశ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని అన్నారు. పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సాగు, -తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.