
హైదరాబాద్ : ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన నవ చండీయాగానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో వేదపండితులు ఈ యాగం జరిపించారు. టీ టీడీపీకి చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, నర్సిరెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా ఈ యాగంలో పాల్గొన్నారు. టీడీపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, అవరోధాలు తొలగిపోవాలని ఈ యాగం నిర్వహిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు ప్రకటించాయి.