
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ మూవీ టీంను ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. 'నాటు నాటు' పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికవ్వడం ఆనందంగా ఉందంటూ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డైరెక్టర్ రాజమౌళిని అభినదించారు. తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తాను ముందే చెప్పినట్లు ప్రపంచ భాషల్లో తెలుగు భాష సత్తా చాటిందన్నారు.
ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గోల్డెన్ గ్లోబ్' అవార్డును ట్రిపుల్ ఆర్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ మూవీలోని 'నాటు నాటు' పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. దాంతో పాటు ఇక ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో కూడా ట్రిపుల్ ఆర్ సినిమా నామినేట్ అయింది.