
చంద్రబాబు.. మాజీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. పోలీసులకు వర్క్ ఫ్రమ్ హోం ఇస్తానని.. మిమ్మల్ని కాపాడుకుంటానంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేసినట్లు ఉన్న వీడియో వైరల్ అయ్యింది. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ సందర్శించిన సందర్భంగా జరిగిన సభలో.. చంద్రబాబు మాట్లాడారు.
ఈ సందర్భంగా పుంగనూరులో పోలీసులపై జరిగిన దాడిని ప్రస్తావించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో పోలీసులు గాయపడిన అంశాన్ని చెబుతూ.. పోలీసులపై కోపం లేదని.. వాళ్లకు కాపాడుకుంటానంటూ చెప్పుకొచ్చారు. పోలీస్ బాస్ పైనే కోపం అని.. పోలీసులను ఇలా చేయమని చెబుతున్న సీఎం జగన్ పైనే నా కోపం అంటూ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగానే పోలీసులకు కూడా వర్క్ ఫ్రం హోం అమలు చేస్తానని.. ఇంట్లో కూర్చుని ప్రపంచంలో పని చేయొచ్చంటూ.. ఆయన వ్యాఖ్యానించినట్లు ఉన్న వీడియో ట్రెండ్ అవుతుంది.
పోలీసులకు వర్క్ ఫ్రం హోం ఇస్తా - చంబా pic.twitter.com/Gr9m6krlgE
— Political Punch (@PoliticalPunch9) August 6, 2023
పోలీసులకు చంద్రబాబు వర్క్ ఫ్రం హోం వ్యాఖ్యలు నిజామా.. ఎడిటింగ్ చేశారా అనే విషయంలో క్లారిటీ లేదు. టీడీపీ అఫిషియల్ పేజీల్లో ఉన్న వీడియోల్లో పోలీసుల ప్రస్తావన ఉంది కానీ.. వర్క్ ఫ్రం హోం అనే మాట లేదు.. సోషల్ మీడియాలో తిరుగుతున్న వీడియోలో మాత్రం పోలీసులకు వర్క్ ఫ్రం హోం ఇస్తానంటూ చెప్పింది ఉంది. దీంతో సోషల్ మీడియాలో చంద్రబాబు వ్యాఖ్యలపై భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
చంద్రబాబు అన్న వ్యాఖ్యలను టీడీపీ పేజీ వాళ్లు ఎడిటింగ్ చేసి డిలీట్ చేశారని.. లైవ్ వీడియోలో మేం పట్టుకున్నాం అని వైసీపీ వాళ్లు అంటున్నారు. దీనిపై టీడీపీ ఘాటుగా స్పందిస్తుంది. వైసీపీ వాళ్లు పాత ఆడియోను తీసుకుని.. కొత్త విజువల్ కు లింక్ చేసి.. ఫేక్ వీడియో క్రియేట్ చేశారని అంటున్నారు.
ఏ పార్టీకి ఆ పార్టీ స్పందిస్తున్నా.. నెటిజన్లు మాత్రం దీన్ని ట్రెండ్ చేయకుండా.. వైరల్ చేయకుండా ఉండలేకపోతున్నారు., పోలీసులకు వర్క్ ఫ్రం హోం ఏంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.