
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షలు రేపు మంగళవారం విడుదల కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సందేశం ఇచ్చారు.
“విద్యార్థుల తల్లిదండ్రులకు నా వినతి. పదోతరగతి పరీక్షా ఫలితాల్లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా కూడా.. మీ అండ వారికి ఎంతో అవసరం. వారిని నిందించడం, ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం చేయకండి. వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకండి. పిల్లలకు మీరు ధైర్యం చెప్పండి. ఈ ఫలితాలు తెలివి తేటలకు కొలమానాలు కాదని, కింద పడినా రివ్వున పైకి లేచే కెరటాల్లా రెట్టించిన ఉత్సాహంతో అద్భుత ఫలితాలను సాధించవచ్చని వారిలో ప్రేరణ కల్గించండి” అని సూచించారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రానున్నాయి. ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్న ఇళ్లలో టీవీ తెరపై విద్యార్థి నంబర్ టైప్ చేయగానే ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు పూర్తిచేశామని సీఎం చంద్రబాబు ట్విట్టర్ లో తెలిపారు.
టీవీ తెరపైనా పదో తరగతి ఫలితాలను చూడవచ్చు. ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్న ఇళ్లలో టీవీ తెరపై విద్యార్థి నెంబరు టైపు చేయగానే ఫలితాలు ప్రత్యక్షమయ్యేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
— N Chandrababu Naidu (@ncbn) May 13, 2019