విజయవాడ సీఐడీ ఆఫీసుకు చేరుకున్న చంద్రబాబు

విజయవాడ సీఐడీ ఆఫీసుకు చేరుకున్న చంద్రబాబు

ఎట్టకేలకు.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత నంద్యాల నుంచి విజయవాడ చేరుకున్నారు మాజీ సీఎం చంద్రబాబు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో 241 కోట్ల రూపాయల అవినీతి కేసులో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనంలో కాకుండా.. సొంత కాన్వాయ్ ద్వారా సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 8 గంటల సమయంలో నంద్యాలలో బయలుదేరిన చంద్రబాబు.. సాయంత్రం 6 గంటల సమయంలో విజయవాడ చేరుకున్నారు. సీఐడీ కార్యాలయంలోకి వెళ్లారు.

నంద్యాల నుంచి విజయవాడ వచ్చే మార్గమధ్యలో కొద్దిసేపు భోజనానికి.. మరికొన్ని సార్లు వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవటానికి.. మరికొన్ని సార్లు టీ, కాఫీ కోసం అక్కడక్కడ ఆగారు చంద్రబాబు. మరికొన్ని చోట్ల టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎదురురావటంతో ప్రయాణ సమయం ఎక్కువ తీసుకున్నది. 

ALSO READ : సీఐడీ అధికారులకు చంద్రబాబు లేఖ

సీఐడీ ఆఫీసులో ప్రక్రియ తర్వాత.. కోర్టులో హాజరుపరచనున్నారు. ఇందుకోసం తన లాయర్లను సిద్ధం చేసుకున్నారు చంద్రబాబు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఇప్పటికే లాయర్ల బృందం విజయవాడ వచ్చింది. మొత్తం 25 నుంచి 30 మంది లాయర్లు.. చంద్రబాబు తరపున వాదించటానికి రెడీగా ఉన్నారు. మరి కోర్టులో జడ్జి నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది.