మోడీ కరెంట్… కేసీఆర్ స్విచ్.. జగన్ ఫ్యాన్ : చంద్రబాబు

మోడీ కరెంట్… కేసీఆర్ స్విచ్.. జగన్ ఫ్యాన్ : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో దెబ్బకొట్టాలని ఎన్నడూ లేని కుట్రలు జాతీయస్థాయిలో జరుగుతున్నాయని ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. విజయనగరంలో ఇవాళ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు…. మోడీ, కేసీఆర్, జగన్ లపై మూకుమ్మడిగా విమర్శలు చేశారు. జగన్ పార్టీ అభ్యర్థుల ఎంపిక తెలంగాణ, ఢిల్లీల్లో జరుగుతోందన్నారు చంద్రబాబు.

అదృష్టం కలిసొస్తే కేసీఆర్ సీఎం అయ్యారు : చంద్రబాబు

మోడీ కరెంట్ తో.. కేసీఆర్ స్విచ్ వేస్తేనే ఏపీలో జగన్ ఫ్యాన్ తిరుగుతుందని అన్నారు చంద్రబాబు. జగన్ ఓ డమ్మీ అని ఆరోపించారు. 

“కేసీఆర్ మొన్నటిదాకా… మీలో ఒకడిగా మీతో సమానంగా కార్యకర్తగా కూర్చున్నవ్యక్తి. ఇపుడు నామీదే దౌర్జన్యానికి దిగుతున్నాడు. కులాల సమీకరణాల్లో నేను మంత్రి పదవి ఇవ్వకపోవడంతో పార్టీ పెట్టారు. అదృష్టం కలిసొచ్చి కేసీఆర్ సీఎం అయ్యారు. హైదరాబాద్ ను ఏలుతున్నారు. ఇపుడు ఏకంగా నామీదే దౌర్జన్యం చేస్తున్నారు. నేను లేకపోతే హైదరాబాద్ లేదు. నాకు కష్టపడే తత్వం ఉంది. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా డెవలప్ చేస్తా” అని అన్నారు చంద్రబాబు.