
మాస్ ఎంటర్టైనింగ్ బీట్ నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఉర్రూతలూగించింది. అందుకే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. కాలిఫోర్నియాలో జరిగిన అవార్ట్స్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గోల్డెడ్ గ్లోబ్ అవార్డు అందుకున్నాడు. ఈ పాటకు లిరిక్స్ రాసిన చంద్రబోస్ బుధవారం లాస్ ఏంజెల్స్ లోని ఆఫీసులో గోల్డెన్ గ్లోబ్ అవార్డు స్వీకరించారు. ఈ విషయాన్ని గోల్డెన్ గ్లోబ్ అవార్స్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ప్రకటించింది. ‘గోల్డెన్ గ్లోబ్ విన్నర్ చంద్రబోస్ అవార్డ్ తీసుకోవడానికి మా ఆఫీసుకు వచ్చారు. ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు’అని పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన చంద్రబోస్ ‘మనస్పూర్తిగా అందరికీ ధన్యవాదాలు. బంగారు భూ గోళమా థాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు.