
కోల్‌కతా: ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ గుడ్‌బై చెప్పాడు. ఫ్రాంచైజీతో రెండేళ్ల పదవీకాలానికి మంగళవారం ముగింపు పలికాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కేకేఆర్ ఎనిమిదో ప్లేస్‌లో నిలిచి ఘోరంగా నిరాశపర్చింది.
దానికి బాధ్యత వహిస్తూ పండిట్ పదవి నుంచి తప్పుకున్నాడు. ‘చంద్రకాత్ కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తున్నాడు. రాబోయే సీజన్ నుంచి కేకేఆర్ హెడ్ కోచ్‌గా కొనసాగడు. 2024లో నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు. బలమైన జట్టును నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషించాడు. అతని అమూల్యమైన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అతని నాయకత్వం, క్రమశిక్షణ జట్టుపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. భవిష్యత్‌లో అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాం’ అని కేకేఆర్ మేనేజ్మెంట్ వ్యాఖ్యానించింది.