జులైలో చంద్రయాన్‌‌ 3

 జులైలో చంద్రయాన్‌‌ 3

చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జులైలో చేపడతామని ఇండియన్  స్పేస్  రిసెర్చ్  ఆర్గనైజేషన్  (ఇస్రో) చీఫ్​ ఎస్.సోమనాథ్  తెలిపారు.  చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను ఈనెల 12న ప్రారంభిస్తామని చెప్పారు.


న్యూఢిల్లీ: చంద్రయాన్ 3 ప్రయోగాన్ని వచ్చే నెల జులైలో చేపడతామని ఇండియన్  స్పేస్  రీసెర్చ్  ఆర్గనైజేషన్(ఇస్రో) చీఫ్​ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఇండియా టుడే కాంక్లేవ్  సౌత్  2023లో ఆయన మాట్లాడారు. చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లను ఈ నెల 12న ప్రారంభిస్తామని చెప్పారు. ‘‘చంద్రయాన్ 2లాగే చంద్రయాన్ 3లోనూ ఒకేరకమైన సైంటిఫిక్  ఆర్కిటెక్చర్  ఉంటుంది. మిషన్  ఉద్దేశం కూడా ఒకేలా ఉంటుంది.

చంద్రయాన్ 3 ప్రయోగ తేదీని త్వరలోనే వెల్లడిస్తం” అని సోమనాథ్  తెలిపారు. ఇక చంద్రయాన్ 2 మిషన్  ఫెయిలైనా.. ఆర్బిటర్ ఇంకా పనిచేస్తున్నదని, డేటా పంపుతున్నదని ఆయన వెల్లడించారు. చంద్రయాన్ 2 మిషన్  ఎందుకు ఫెయిలైందో తెలుసుకునేందుకు తాము చాలా కష్టపడ్డామని పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ లో ఎర్రర్  వల్లే ఆ మిషన్  ఫెయిల్  అయిందని చెప్పారు. అలాగే సూర్యడిపై అధ్యయనం చేయడానికి డిజైన్  చేసిన ఆదిత్య ఎల్ 1 మిషన్ ను ఆగస్టులో నిర్వహిస్తామని సోమనాథ్  వెల్లడించారు.