తగ్గేదేలా : నాలుగో కక్ష్యలోకి విజయవంతంగా చంద్రయాన్ 3

తగ్గేదేలా : నాలుగో కక్ష్యలోకి విజయవంతంగా చంద్రయాన్ 3

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 అంతరిక్ష నౌక ఫోర్త్ ఆర్బిట్ రైజింగ్ మ్యానోవర్ (భూమి-బౌండ్ అపోజీ ఫైరింగ్) విజయవంతంగా నిర్వహించింది. దీంతో చంద్రయాన్ 3 సక్సెస్ ఫుల్ గా నాలుగో కక్ష్యలోకి చేరింది. ముందు చెప్పినట్టుగానే ఈ రోజు మధ్యాహ్నం మరోమారు శాస్త్రవేత్తలు దాని కక్ష్యను పెంచారు. అలా దాని ఎత్తును పెంచుకుంటూ చంద్రుడు కక్ష్యలోకి తీసుకువెళ్లి.. ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్ చేయనున్నారు. తదుపరి ఫైరింగ్ ను జూలై 25న మధ్యాహ్నం 2 నుంచి 3గంటల మధ్య నిర్వహించబడుతుందని ఇస్రో ఈ సందర్భంగా ట్వీట్ చేసింది.

జూలై 14 న, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎల్‌వీఎమ్ 3-ఎమ్ 4 రాకెట్‌లో చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించింది. మధ్యాహ్నం 2.35 గంటలకు లిఫ్ట్-ఆఫ్ అయిన 17 నిమిషాల తర్వాత, ఉపగ్రహాన్ని ఖచ్చితంగా ఉద్దేశించిన కక్ష్యలోకి చొప్పించారు.