Chandrayaan 3: చంద్రయాన్- 3 నుంచి లేటెస్ట్ వీడియో

Chandrayaan 3: చంద్రయాన్- 3 నుంచి లేటెస్ట్ వీడియో

 చంద్రయాన్ 3 గురించి ఇస్రో మరో వీడియో రిలీజ్ చేసింది.  చంద్రుడిపై ల్యాండ్ అయిన చంద్రయాన్ 3 రోవర్ సులభంగా దిగేందుకు ర్యాంప్ సహాయపడిందని  వీడియో రిలీజ్ చేసింది.

అలాగే సోలార్ ప్యానెల్ రోవర్ కు శక్తిని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పించిందని వివరించింది. ల్యాడర్ నుంచి రోవర్ బయటకు వచ్చే టప్పుడు  ర్యాంప్, సోలార్ ప్యానెల్ ఎలా పనిచేశాయో ఈ వీడియోలో స్పష్టం కనిపిస్తోంది. చంద్రయాన్  3 మిషన్ లో 26  యంత్రాంగాలను బెంగళూరులోని  యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో (URSC)తయారు చేశారని ఇస్రో ట్వీట్ చేసింది. 

ఉదయం ఇస్రో రిలీజ్ చేసిన వీడియోలో  ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ కిందకు దిగే సమయంలో ల్యాండర్ నీడ కనిపించింది అంటే  చంద్రుడిపై ఎండ ఉన్నట్లు  వీడియోలో కనిపించింది.  రోవర్ చంద్రుడిపై బుడి బుడి అడుగులు వేస్తున్న సమయంలో.. రోవర్ చక్రాల ముద్రలు స్పష్టంగా చంద్రుడిపై పడ్డాయి. అంటే ల్యాండర్ దిగిన ప్రదేశంలో మట్టి, దుమ్ము ఉన్నట్లు వీడియో చూస్తే అర్థం అవుతుంది.