హైదరాబాద్లో చంద్రయాన్ 3 గణేష్ మండపం

హైదరాబాద్లో చంద్రయాన్ 3 గణేష్ మండపం

దేశ వ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా ముంబై, హైదరాబాద్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తుంటారు. విభిన్న ఆకారాల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేస్తూ నిర్వాహకులు భక్తులను ఆకట్టుకుంటారు. తాజాగా హైదరాబాద్లో  ఓ వినాయక మండపం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. 

హైదరాబాద్ లోని కూకట్ పల్లి శాంతినగర్లో చంద్రయాన్ 3 గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలే ఇస్రో చంద్రయాన్ 3 మూన్ మిషన్ను విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగింది. దీంతో ఈ  చంద్రయాన్-3 మిషన్‌ను వర్ణించే విధంగా PSLV రాకెట్ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రస్తుతం చంద్రయాన్ 3 గణేష్ మండపం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ALSO READ: బాలాపూర్ గణనాథునికి మంత్రి సబిత తొలి పూజ 

హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 18వ తేదీన ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 11 రోజుల పాటు కన్నుల పండువగా జరుగుతాయి. సెప్టెంబర్ 28న గణేష్ విసర్జనతో ఉత్సవాలు ముగుస్తాయి.