సిగ్నల్ వద్ద సైక్లింగ్ టైమింగ్‌ను మార్పు చేస్తాం: రంగనాథ్

సిగ్నల్ వద్ద సైక్లింగ్ టైమింగ్‌ను మార్పు చేస్తాం: రంగనాథ్

హైదరాబాద్ లో అమలవుతున్న ట్రాఫిక్ కొత్త రూల్స్ పై ట్రాఫిక్ విభాగం ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టింది. ‘ఆపరేషన్ రోప్’ లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు నగర జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ , ఆధికారులు అవగాహన కల్పించారు. ఆపరేషన్ రోప్ అనే కార్యక్రమం సీపీ అదేశాలమేరకు నగర వ్యాప్తంగా చేపట్టామని రంగనాథ్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వాహనాలు లైను దాటితే ఫైన్ పడుతుందని తెలియజేశామన్న ఆయన.. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.

ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తో పాటు, సీట్ బెల్స్ట్ ధరించాలని ఆదేశించారు. అందరి దగ్గర వాహనాలకు సంబంధించిన పత్రాలు ఉండాలని పోలీస్ కమిషనర్ రంగనాథ్ చెప్పారు. అతి త్వరలో ట్రాఫిక్ నిబంధనల విషయంలో మార్పులు రాబోతున్నాయని స్పష్టం చేశారు. చాలా చోట్ల సిగ్నల్ టైమింగ్ ను మారుస్తామని, ప్రస్తుతం చాలా తక్కువ సమయం ఉందన్నారు. సిగ్నల్ వద్ద సైక్లింగ్ టైమింగ్ ను సైతం మార్పు చేస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలన్న ఆయన... ఇవాల్టి నుండి ట్రాఫిక్ రూల్స్ పై పోలీస్ ఎన్ఫోర్స్ మెంట్ నిఘా ఉంటుందని చెప్పారు.