ఏపీలో తెలుగు అకాడమి పేరు మార్పు

ఏపీలో తెలుగు అకాడమి పేరు మార్పు

అమరావతి‌: ఆంధ్రప్రదేశ్ లో  తెలుగు అకాడమి పేరు మారింది. తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి చోటు కల్పించారు. ఆయనను ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యాబోధన దిశగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా తెలుగు అకాడమీ పేరు మార్చేసింది. మాతృభాషలోనే బోధన జరగాలని తెలుగు భాషా కోవిదులు, మేధావులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంకే కట్టుబడి.. ప్రాధాన్యతనిస్తున్నట్లు పలుమార్లు బహిరంగంగా ప్రకటనలు చేసింది. కాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.