Elon Musk:ఉద్యోగులకు తిక్కపని అప్పచెప్పిండు

Elon Musk:ఉద్యోగులకు తిక్కపని అప్పచెప్పిండు

టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ట్విట్టర్ లో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ట్విట్టర్ ను కొనుగోలు చేసి, ఉద్యోగులను తొలగించడం, బ్లూ టిక్ సబ్క్రిప్షన్ తీసుకురావడం, ఆఫీసులను మూసేయడం, ట్విట్టర్ సీఈఓగా తన పెంపుడు కుక్కను నియమించడం వంటిటి పనులన్నీ చేస్తున్నాడు. తాజాగా తను చేసిన ట్వీట్లను అందరి ట్వీట్లకన్నా మొదట కనిపించేలా చేయాలని ట్విట్టర్ ఇంజనీర్లని ఆదేశించాడు. అందుకోసం మొత్తం ట్విట్టర్ అల్గారిథమ్ మార్చాలని ఆదేశించాడు. అయితే, దీనిపై కొంతమంది ఉద్యోగులనుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ విషయాలన్నీ ట్విట్టర్ ఉద్యోగి టామ్ మిచెల్ హిల్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన మస్క్.. ‘టామ్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని, అతను లీవ్ పెట్టి వెళ్లి గూగుల్ లో ఉద్యోగంలో చేరాడని అన్నారు.